calender_icon.png 31 January, 2026 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక పండుగలు

31-01-2026 12:19:05 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, జనవరి 30 (విజయక్రాంతి): సంస్కృతికి సాంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. శుక్రవారం గంగాధర మండలం మధురానగర్, బూ రుగుపల్లిలో  గ్రామాల్లో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతరను ఎమ్మెల్యే సం దర్శించారు. జాతర కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల ప్రజలు జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మధురానగర్, బూరుగుపల్లిలో సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి సాకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేముల భాస్కర్, ఉప సర్పంచ్ తూం రాజు, అంజి, సాగి అజయ్ రావు, తదితరులు పాల్గొన్నారు.