మహేంద్రగిరి వారాహి నిండా సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు
సుమంత్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో సుమంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది”అన్నారు.
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. “టీజర్‌లో చూసిన దానికంటే సినిమాలోని కంటెంట్ మరింత అద్భుతంగా ఉం టుంది” అని తెలిపారు. నిర్మాత మధు మాట్లాడుతూ.. “టీజర్ విడుదలైన వెంటనే థియేట్రికల్ బిజినెస్ మొత్తం పూర్తయింది. ఈ సినిమా నుంచి ప్రేక్షకులు ఊహించని రెండు అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి” అని చెప్పారు. నటీనటులు మంజు భార్గవి, మీనాక్షి గోస్వామి, వంశీ చాగంటి, శ్రీనివాస్ వడ్లమాని, ఫైట్ మాస్టర్ అంజి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






