calender_icon.png 2 August, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్డాకుల ఏపిఎంగా మహేష్ బాధ్యతల స్వీకరణ

01-08-2025 08:32:45 PM

అడ్డాకుల: మండల కేంద్రంలో మండల మహిళ సమైక్య కార్యాలయంలో నూతనంగా ఏపిఎం మహేష్(APM Mahesh) బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన ఏపీఎం సుధీర్ బదిలీపై భూత్పూర్ బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా అడ్డాకుల ఏపిఎం మహేష్ మాట్లాడుతూ.. మహిళలకు రుణాలు, శ్రీనిధి, మహిళల వివిధ అవసరాల కోసం వచ్చేవారు నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. అంతకుముందు సిబ్బంది సీసీలు శ్రీహరి, సురేష్, అరుణ, వివోఏ లు, శ్రీధర్, నసిరుద్దీన్, స్వప్న, చంద్రకళ, దేవి, నూతన ఏపీఎం మహేష్ ను శాలువాతో సత్కరించి ఆహ్వానించారు.