15 June, 2026 | 2:45 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా?

24-08-2024 12:59 AM

‘లై’ సినిమాలో హీరో నితిన్ సరసన నటించటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మేఘా ఆకాశ్. ఈ భామ తాజాగా నటించిన చిత్రం తుఫాన్. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ‘వికటకవి’, ‘సహఃకుటుంబం’ సినిమాల్లో నటిస్తోంది. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న మేఘా ఆకాశ్ వ్యక్తిగత జీవితంలోనూ కీలక ఘట్టంలో అడుగుపెట్టింది. ఇటీవలే తన ప్రియుడు సా యి విష్ణుతో నిశ్చితార్థం పూర్తి చేసుకుంది.

మేఘ ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. మేఘా ఆకాశ్ విష్ణు ఆరేళ్లుగా ప్రే మలో ఉన్నారు. పెళ్లి ఎప్పుడనే విషయాన్ని ఇ ప్పటికైతే మేఘ ప్రకటించలేదు. కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి తేదీపై స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు సినీ జనా లు.. మేఘ పెళ్లి తర్వాత ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తుందా? లేదా? అనే విషయమై చర్చకు తెర తీశారు.