11 August, 2026 | 6:53 AM

కాకినాడ ఓడరేవులో ‘మట్కా’ టీమ్

24-08-2024 12:57 AM

హీరో వరుణ్ తేజ్ ‘మట్కా’ సి నిమాతో పాన్ ఇండియాలో అడుగుపె డుతున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెం ట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కాకినాడలో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ ముఖ్యమైన షెడ్యూల్‌లో, టీమ్ టాకీ పార్ట్, ప్రముఖ తారాగణంతో యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ చేతిలో తుపాకీతో కాకినాడ ఓడరేవులో క్రూయిజ్ షిప్ ముందు నిలబడి కనిపించాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ మ్యూ జిక్ అందిస్తుండగా, ఏ కిషోర్‌కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు.