25 March, 2026 | 12:45 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

మేజర్ ముకుంద్.. అమరన్

25-10-2024 12:00 AM

ఔను, దేశానికి సేవ చేయడంలో మేజర్ ముకుంద్ కలిగి ఉన్న నిబద్ధతకు, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ‘అమరన్’ చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న మూవీ టీమ్‌కు సెల్యూట్ చేయకుండా ఉండలేరు. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న బహు భాషా చిత్రమే ‘అమరన్’.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ స్టార్ హీరో నానితో ట్రైలర్‌ను లాంచ్ చేయించింది. ట్రైలర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పరిచయం చేస్తుంది. మేజర్ ముకుంద్, అతని కుమార్తె హార్ట్ టచ్చింగ్ ఫుటేజ్‌తో ట్రైలర్ ప్రారంభమైయింది.

మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్, అతని భార్యగా సాయిపల్లవి, ఆన్-స్క్రీన్ డాటర్ క్యారెక్టర్స్‌లోకి ట్రైలర్ నేచురల్‌గా ట్రాన్స్‌ఫర్మేన్షన్ అవ్వడం కట్టి పడేసింది. తన దేశానికి సేవ చేయడంలో మేజర్ ముకుంద్ నిబద్ధత ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రైలర్‌లో ధైర్యం, త్యాగం థీమ్స్‌తోపాటు మేజర్ ముకుంద్ సైనిక జీవితం, ఫ్యామిలీ బాండింగ్‌ను అద్భుతంగా చూపించారు.