25 March, 2026 | 2:14 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

తస్సాదియ్యా.. కలబడితే నీదే దునియా!

25-10-2024 12:00 AM

వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి, నోరా పతేహి కథానాయికలుగా నటిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ చిత్రంగా మట్కా రూపొందింది. ఇది నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజేందర్ రెడ్డి తీగల, రజిని తాళ్లూరి నిర్మాతలు.

గురువారం ఈ సినిమా నుంచి సెకం డ్ సింగిల్‌గా ‘తస్సాదియ్యా..’ అనే పాట విడుదలైంది. ‘యురేకా.. కూ ర్చుంటే ఏదీ రాదు.. నిలబడి చూస్తుం టే కాదు.. కలబడితే నీదే దునియా అంతా’ అంటూ సాగుతున్న ఈ పాట వింటుంటే సంగీత ప్రియులకు చిరు ‘యురేకా కసామిసా‘ గీతం గుర్తొస్తుంది. రెండు పాటలకూ సంబంధం లేకున్నా చిరుని మాత్రం వరుణ్ గుర్తు చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం ఈ పాటను ఓ స్థాయికి తీసుకెళ్లింది. భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని మనో ఆలపించారు.