20 March, 2026 | 8:34 AM

మున్సిపాలిటీల్లో భారీ ప్రతిపాదనలు

20-03-2026 12:03 AM
  1. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విన్నపాలు

అధిక బడ్జెట్ పనులను ప్రతిపాదిస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రభుత్వానికి నివేదిస్తున్న అధికారులు

సంగారెడ్డి, మార్చి 19(విజయక్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. 99 రో జుల పాటు జూన్ 12 వరకు 10 ప్రధాన అంశాలతో నిర్వహించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, ప్రభుత్వ కార్యాలయా ల్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారంతో పాటు ఇత ర అంశాలను ఇందులో పొందుపరిచారు.

తక్కువ అంచనా వ్యయంతో పూర్తయ్యే పనులకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ, పట్టణంలోని వార్డులకు, మండలం, మున్సిపా లిటీలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక్కోరకంగా బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. ఖర్చు చేసిన తర్వాత డీటెయిల్ ఓచర్ బిల్లు పెట్టుకున్న పక్షంలో ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 మున్సిపాలిటీలలో అత్యధి కంగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. 

వ్యయంతో కూడుకున్న ప్రతిపాదనలు..

పారిశుద్ధ్యం, ఆరోగ్యం సంబంధిత కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మున్సిపల్ వార్డుల్లో, గ్రామ పంచాయతీల్లో అనేక సమస్యలు తీష్ట వేసి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు నిర్మించాలని మున్సిపాలి టీతో పాటు జీపీల్లో ప్రతిపాదనలు అందజేస్తున్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇవి పెద్ద మొత్తం వ్యయంతో కూడుకున్నవి కావడంతో అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపుతున్నారు. 

ఇలాంటివి కూడా..

తమ ఇళ్ల ముందు అసౌకర్యంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించాలని ప్రజ ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు. సాధారణ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. వాటి పరిష్కారంలో జాప్యం అవుతుండడంతో ప్రజా ప్రతినిధులు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించాలని జాబితాలు అందజేస్తుండడం గమనార్హం. అధిక బడ్జెట్ కలిగినటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీలో సైతం చాలా వరకు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ సిస్టమ్ కోసం ప్రతిపాదనలు భారీగానే వస్తున్నాయి.  

ప్రభుత్వానికి పంపిస్తున్నాం.. శ్రీనివాస్రెడ్డి, కమిషనర్, సంగారెడ్డి

రోడ్లు, మురుగు కాలువలు ఇతరత్రా భారీ అంచనా వ్యయంతో కూడుకున్న పను లు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందజేస్తున్నా రు. జనరల్ ఫండ్ నుండి సరిపోయేంత వర కు అన్ని వార్డుల్లో వినియోగిస్తాం. ప్రత్యేక పనులకు స్పెషల్ గ్రాంట్ మంజూరు అయి తే వాటిని ఖర్చు చేస్తాం. బడ్జెట్కు మించి ప్ర తిపాదనలు వస్తే ప్రభుత్వానికి నివేదిస్తు న్నాం.  అక్కడి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడతాం.