25 March, 2026 | 2:10 AM

రుద్రూర్ మండల కేంద్రంలో భారీ రోడ్డు ప్రమాదం

25-03-2026 12:08 AM
  1. సంఘటన స్థలాన్ని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  2. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు 
  3. అందించాలని అధికారులకు ఆదేశాలు జారి

నిజామాబాద్, మార్చ్ 24 (విజయ క్రాంతి): ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న సంఘటనలో ఊరు ప్రయాణికులు గాయపడ్డారు బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె.ఎం.సీ కాలనీ వద్ద  లారీని ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. బోధన్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టీజీ 16 జెడ్ 0102 నంబరు  బస్సు ఎదురుగా వస్తున్న లారీ నెంబర్ టీఎస్ 22 టి 3348 ని ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలైన వారి ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. లారీ బస్సు ఢీకొన్న సంఘటన స్థలానికి చేరుకున్న నిజామాబాద్ సిపి సాయి చైతన్య క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ కు కొందరిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వయంగా శతఘరాత్రుల వైద్య చికిత్స వారిని ఆసుపత్రిలోకి చేర్చడం పర్యవేక్షించారు. 

అనంతరం సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని రోడ్డు ప్రమాదంలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,రోడ్ స్టాపర్లు, రోడ్డు డివైడర్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో సంబంధిత అధికారులకు సిపి సాయి చైతన్య సూచనలు చేస్తూ  ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించి వాహనాలను జెసిబి సహాయంతో పక్కకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి బోధన్ అత్యవసర వైద్య సేవలు అందించడం తోపాటు. 

మెరుగైన వైద్య సేవల కోసము క్షతగాత్రులను నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సంబంధిత అధికారులకు సిపి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఈ సంఘటన స్థలానికి నిజామాబాద్ సిపి తో పాటు బోధన్ ఎసిపి పి శ్రీనివాస్  , బోధన్ రూరల్ సీఐ  విజయబాబు , రుద్రూర్ ఎస్త్స్ర సాయన్న సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆర్టీసీ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.