బీసీలకు మెజార్టీ అవకాశాలు
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన వీహెచ్
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు, అం దులో మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కువగా అవకాశాలు కల్పించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నా రు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవా రం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఆలోచనలను రాష్ట్రంలో అమలు చేయ డం సంతోషకరమన్నారు.
మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా బీసీలకు మెజార్టీగా అవకాశాలు దక్కడం అభినందనీయమన్నా రు. బీసీలకు రాజ్యాంగ పరంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయాలని సీఎంను వీహెచ్ కోరారు. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. లక్ష్మణ్‌యాదవ్ కూడా ఉన్నారు.




