ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్
బూర్గంపాడు, ఫిబ్రవరి24,(విజయక్రాంతి): మండలంలోని పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పద్మ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ మరియు మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికీ కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక పట్టి నగర్ గ్రామ అధ్యక్షులు బందెల ప్రభాకర్, సీనియర్ నాయకులు బానోత్ రాజేష్, పొన్నం నాగేందర్, కారం శ్రావణ్, వార్డు సభ్యులు వినయ్, చంద్రగిరి వెంకటేశ్వర్లు, జంగం లక్ష్మణ్, మరసట్ల సురేందర్, దోమల లాజర్ తదితరులు పాల్గొన్నారు.




