5 March, 2026 | 5:15 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

16-10-2025 12:17 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : డ్రగ్స్ రహిత మెదక్ జిల్లా గా తీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించాలన్నారు. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు.

గంజాయి సాగు చేస్తే రైతు బంధు,ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు. రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల ,కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ కూడళ్ల వద్ద ,మెడికల్ షాప్ లు,పరిశ్రమల వద్ద తనిఖీలు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ డాబాల వద్ద, వివిధ రాష్ట్రాల నుంచి పరిశ్రమలకు ఉపాధి కోసం వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.