calender_icon.png 16 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామమందిర నిర్మాణానికి సంపూర్ణ సహకారం

16-10-2025 12:15:52 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

జిన్నారం, అక్టోబర్ 15 : బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించనున్న రామ మందిరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించడంలో దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో 200 దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.