15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి..

02-06-2025 07:50 PM

హుజురాబాద్ ఏసిపి మాధవి 

హుజురాబాద్ (విజయక్రాంతి): హుజురాబాద్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి(ACP Vasamsetty Madhavi) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలత నగరాలుగా అభివృద్ధి చేయుటకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana State Formation Day) పురస్కరించుకొని హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్, పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాధవి 2కె రన్ ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ సమిష్టిగా పరిసరాలను పరిశుభ్రతను పాటించాలని సూచించారు. రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలి అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. టూ కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్, పురపాలక సంఘం మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాంబరాజుతో పాటు క్రీడాకారులు పట్టణవాసులు, వాకర్స్ పాల్గొన్నారు.