17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

02-06-2025 07:55 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(Telangana State Formation Day) అట్టహాసంగా జరిగాయి. మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.

తాసిల్దార్ కార్యాలయంలో, గ్రామపంచాయతీలో తాసిల్దార్ రామకృష్ణారెడ్డి ఎంపీడీవో కార్యాలయంలో రమేష్ దీన్ దయాల్ గ్రంధాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పోలీస్ సర్కిల్ ఆఫీసులో సిఐ రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సొసైటీ ఆఫీసులో కందిబండ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదరావు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అవతరణ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా  ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఉప్పుల యుగంధర్ రెడ్డి, బుర్రి శ్రీరాములు, ఉప్పుల జానకి రెడ్డి, చలంచర్ల ప్రభాకర్, భద్రం రాజు కృష్ణ ప్రసాద్, గండు అంజయ్య, మాజీ వార్డ్ నెంబర్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.