15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

31-10-2025 12:00 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి 94వ డివిజన్ షేక్పేట లోని 35, 36, 37, 38 పోలింగ్ బూత్(హజీజ్ బాగ్, అరవింద్ నగర్ కాలనీ)లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని తదితరులతో కలిసి గల్లీ గల్లీ కలియ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ కొనసాగుతుందన్నారు.ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వారిని సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు మంచి పనులు చేసి ఓట్లు అడుగుతున్నామని,  ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. బడుగు, బలహీన వర్గానికి చెందిన సోదరుడు నవీన్ యాదవ్ కు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా చేస్తాడని ఎమ్మెల్యే అన్నారు.