31-10-2025 12:00:00 AM
 
							బి.ఎన్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి
యాచారం, అక్టోబర్ 30 : విగ్నేష్ కుటుంబానికి అండగా ఉంటానని బి.ఎన్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి అన్నారు. మేడిపల్లి నకర్త నిరుపేద కుటుంబానికి చెందిన గేరే విగ్నేష్ గత మూడు రోజుల క్రింద హైదరాబాదులో సెంట్రింగ్ పని చేస్తుండగా మూడో అంతస్తు నుండి అకస్మాత్తుగా కిందికి పడిపోవడంతో అతని కాళ్లు విరిగిపోయాయి. విషయం తెలుసుకున్న బి.ఎన్.ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విగ్నేష్ ను పరామర్శించి ఓదార్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు అతని చికిత్స నిమిత్తం రూ. 15 వేలు.ఆర్థిక సహాయం అందజేశారు. విగ్నేష్ త్వరలో కోలుకోవాలని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కష్టాలలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చర్ల సంపత్ కుమార్, మన్యం అజయ్, గేరే విజయ్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.