28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి

09-05-2026 07:03 PM

పాపన్నపేట: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం తలపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పాపన్నపేట మండల భాజపా నాయకులు కోరారు. శనివారం మండల పరిధిలోని చిత్రియాల చౌరస్తాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాట్లు పూర్తి చేసిందని, పాపన్నపేట మండలం నుంచి మహిళలు, ప్రజలు, యువకులు, మోడీ అభిమానులు మోడీ సభను విజయవంతం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఉపాధ్యక్షులు మల్లేశం, కార్యదర్శులు చక్రపాణి, గూడెం మల్లేశం, సంతోష్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌస్, బీజేవైఎం అధ్యక్షులు జగదీష్, కోశాధికారి చంద్రయ్య, బూత్ అధ్యక్షులు మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.