కళాశాల బంద్‌ను విజయవంతం చేయండి
PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్...
అదిలాబాద్, (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి డిమాండ్ చేస్తూ ఈనెల 2వ తేదీ నుండి 72 గంటల పాటు చేపట్టే డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేష్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రూ. 8 వేల కోట్లు విడుదల చేయాలని, డొనేషన్లు తీసుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలను మూసివేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేసే ప్రభుత్వ కుట్రను వ్యతిరేకించాలన్నారు. ఈ డిమాండ్లతో PDSU ఆధ్వర్యంలో జూలై 2,3,4 తేదీలలో 72 గంటల పాటు చేపట్టే కళాశాల బంద్ ను జయప్రదం చేయాలని విద్యార్థులకు, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల యజమానులకు, ప్రజాస్వామిక వాదులకు, కర్షకులకు, కార్మికులకు, మేధావులకు, విప్లవ వాదులకు పిలుపునిచ్చారు.






