01-07-2025 12:37:17 PM
వలిగొండ,(విజయక్రాంతి): భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) జులై 1, 1955లో స్థాపించగా నేటికీ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వలిగొండ ఎస్బీఐ(Valigonda SBI) రెడ్లరేపాక శాఖలో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఉద్యోగులు అన్నారు .ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రవీందర్, ఉద్యోగులు రాజు, సౌజన్య, కవిత, రాజ్యలక్ష్మి, సంజీవ, సరిత తదితరులు పాల్గొన్నారు.