01-07-2025 12:42:37 PM
ఏవో లావణ్య, సిఐ రాజు వర్మ
చర్ల, (విజయక్రాంతి): మండలంలో ఎవరైనా నకిలీ విత్తనాలు(Fake seeds) విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని మండల వ్యవస్థ అధికారి లావణ్య, సీఐ రాజు వర్మ హెచ్చరించారు. మండల పరిధిలో ఆర్ కొత్తగూడెం లోని హర్ష సీడ్ అండ్ పెస్టిసైడ్ షాపుల వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం నిషేధించనీ, అనుమతి లేని విత్తనాలు అమ్మితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండలంలో గల పురుగుల మందు షాపులు, విత్తనాల షాపులలో రైతులను మోసం చేసే నకిలీ పురుగుమందులను విత్తనాలను విక్రయించవద్దని, రైతులు తీసుకున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు తప్పనిసరిగా బిల్లులు చెల్లించాలని వారు స్పష్టం చేశారు. దుకాణంలోనే స్టాక్ వివరాలను బోర్డుపై నిస్ డిస్ప్లే చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో చర్ల ఎస్సై నర్సిరెడ్డి పాల్గొనడం జరిగింది.