calender_icon.png 18 November, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ శత వార్షికోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయండి

18-11-2025 08:04:03 PM

దేశంలో సిపిఐ చరిత్రకు వందేళ్లు..

20వ తేదీన గరిడేపల్లిలో నిర్వహించే ప్రచార జాతను విజయవంతం చేయండి: సిపిఐ 

గరిడేపల్లి (విజయక్రాంతి): సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార జాతను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంగళవారం ప్రచార జాతకు సంబంధించిన కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దీనిలో భాగంగానే ఈనెల 20వ తేదీన గరిడేపల్లికి వచ్చే ప్రచార జాతలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆ బహిరంగ సభను కూడా విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య,ఎడ్ల అంజన్ రెడ్డి,ప్రధాని సైదులు,వెంకన్న,ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు పంగ సైదులు,షేక్ సైదా హుస్సేన్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.