calender_icon.png 18 November, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

18-11-2025 08:06:59 PM

46వ సారి రక్తదానం చేసిన సామల సంతోష్ రెడ్డి

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెబిసి రక్తనిధి కేంద్రంలో సదాశివనగర్ మండలం మండలం ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి వారి కుమారుడు సామల కియాన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 46వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదాత సామల సంతోష్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీల కోసం, వివిధ ఆపరేషన్ల నిమిత్తమై, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికోసం సకాలంలో రక్తాన్ని అందజేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడానికి యువత రక్తదానానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ హైమద్, నిర్వాహకులు జీవన్, వెంకటేష్ లు పాల్గొన్నారు.