25-05-2025 12:00:00 AM
-కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, మే24: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈనెల 26న తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి రానున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు.
శనివారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గానికి కేటాయించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. శంకుస్థాపన అనంతరం మధ్యా హ్నం ఖానాపూర్ గ్రామంలో భారీ బహిరంగ సభ ఉంటుందని సభకు కల్వకుర్తి నియోజకవర్గం లోని రెండు మున్సిపాలిటీలు, ఆరు మండలాల కు చెందిన ప్రజలం తా బహిరంగ సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
బహిరంగ సభకు డిప్యూటీ సీఎం తో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లురవి, ఎఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి లు హాజరుకాను న్నట్లు ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన చెప్పారు. నియోజకవర్గాని కి ఎనిమిది నూతనంగా 33.11 కేవీ సబ్ స్టేషన్లు, 300 ట్రాన్స్ఫార్మర్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక శ్రద్ధతో రూ. 600 కోట్లను మంజూరు చేశారని మరో రూ. 400 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఆయన హామీచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని... నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.