12 July, 2026 | 3:10 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

26-06-2025 04:53 PM

వలిగొండ (విజయక్రాంతి): కేంద్రంలో అధికారులకు వచ్చిన బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్(CITU District Assistant Secretary Turkapalli Surender) కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం సమ్మె నోటీసులను వివిధ శాఖ అధికారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ... మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో మారుస్తూ కార్మికుల గొంతు కోసే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులు శ్రమకు తగ్గ వేతనం అడిగే హక్కును కోల్పోతారని అన్నారు.

అంతే కాకుండా కార్మికుల పనిగంటల విధానాన్ని మారుస్తూ 8 గంటల నుండి 12 గంటలకు పెంచడంతో దీనివల్ల కార్మికుల శ్రమ దోపిడికి గురువుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు కొండే నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి ఎల్లమయ్యా, మండల నాయకులు మధు, లింగస్వామి, స్వామి, లలిత, రేణుక, శ్రీను, సత్తయ్య, రాములు, అంజయ్య పాల్గొన్నారు.