12 July, 2026 | 2:15 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

సినిమా హాల్లో ప్రేక్షకులపై ఊడిపడ్డ సీలింగ్

26-06-2025 04:47 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ముకుంద థియేటర్(Mukunda Theatre)లో బుధవారం రాత్రి సెకండ్ షో కుబేర సినిమా ప్రదర్శిస్తుండగా పైన ఉన్న సీలింగ్ ప్రేక్షకులపై ఊడి పడింది. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. థియేటర్ నిర్వాహకులు దెబ్బతిన్న సీలింగ్ కు మరమ్మతులు చేయించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రేక్షకులు రాత్రి యాజమాన్యంతో గొడవపడ్డారు. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.