12 July, 2026 | 2:00 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయండి

12-07-2026 12:00 AM

కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

కూకట్‌పల్లి, జూలై 11 (విజయక్రాంతి) : ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. కూకట్ పల్లి నియోజకవర్గం లోని కేపిహెచ్ బి కాలనీ 4వ రోడ్డు, మోతీ నగర్ డివిజన్ పరిధి అవంతి నగర్ లో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియను శనివారం బండి రమేష్ పరిశీలించారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, బి ఎల్ ఎ బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. జరుగుతున్న ఈ ప్రక్రియలో ఎవరు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఎన్నికల జాబితాలో ఉండేలా చూడాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతం అయ్యేలా సమిష్టిగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాబు, రాఘవేందర్, శ్రీనివాస్, రంగమోహన్, మన్నె గోపాల్ చౌదరి, రాజేష్, అరవిందు, దినేష్, గంధం రాజు, బాబ్జి, తూము మనోజ్,శివ చౌదరి, బచ్చు మళ్ళీ, సంధ్య, సుజాత, వాణి,తదితరులు పాల్గొన్నారు.