12 July, 2026 | 1:54 AM

ప్రతాప్‌నగర్‌లో పర్యటించిన మన్నె గోవర్ధన్ రెడ్డి

12-07-2026 12:00 AM

ఖైరతాబాద్, జూలై 11 (విజయక్రాంతి): వెంకటేశ్వర కాలనీ డివిజనులోని ప్రతాప్ నగర్లో సమస్యలపై సమరం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రతాప్ నగర్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడుతూ అర్థరాత్రి వేళ తాగునీటి సరఫరా జరుగుతోందని తెలిపారు. దాని వల్ల ఇబ్బంది పడుతున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు.

వారం రోజులుగా వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగడం లేదని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ రెడ్డి వెంటనే స్పందిస్తూ.. జలమండలి మేనేజర్ శివకుమార్ తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. గతంలో మాదిరిగానే తాగునీటిని సరఫరా చేయాలని కోరారు.

వీధి దీపాల లైన్మెన్ ప్రదీప్ తో మాట్లాడి వెలగని వీధి దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, లూజ్ కనెక్షన్ ఉన్నవాటికి మరమ్మతులు చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో సత్వరమే స్పందించిన గోవర్ధన్ రెడ్డికి ప్రతాప్ నగర్ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేశ్, ధన్ను రాజ్, రమేశ్, రాము, శ్రీకాంత్, విశాల్, వెంకటాచారి, రాజు తదితరులు పాల్గొన్నారు.