calender_icon.png 1 October, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం

01-10-2025 12:00:00 AM

గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

చండూరు, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి ): నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులుఅన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు సంవత్సరముల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. సమాజంలో నిరుపేదలకు సహాయం చేయడంలో మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మా ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ లభించదని వారు అన్నారు.

మా విద్యా సంస్థల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజుతో విద్యను అంది స్తున్నామని అన్నారు.  గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కోడి ప్రీతి, కోడి శృతి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు.