15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

23న ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయండి

18-11-2025 04:39 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఈ నెల 23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు కోరారు. మంగళవారం లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామన్నారు. వలస వచ్చిన లంబాలను ఎస్టీ జాబితా నుండి తొలిగించాలనే ఏకైక డిమాండ్ తో ఈ నెల నవంబర్ 23న ఉట్నూర్ కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో ధర్మయుద్ధం పేరిట ఆదివాసిల భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు అన్ని ఆదివాసీల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సూర్ పటేల్, మండల ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మెస్రం ఛత్రు, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి గుర్రాల శంకరయ్య, సాంస్కృతిక కార్యదర్శి బద్ది ధర్మయ్య, నాయకులు తొడప అచ్యుత్ రావు,కుర్సింగే విజయ్ కుమార్, కుర్సింగే రాము, బద్ది శ్రీనివాస్, ఆత్రం లింగా రావు తదితరులు పాల్గొన్నారు.