18-11-2025 04:31:09 PM
అధికారులు ఇచ్చిన ఆదేశాలను విధిగా పాటించాలి
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ ఇన్ చార్జీలు రైతులతో బాధ్యతతో మెలుగుతూ వరి ధాన్యం పక్రియను సజావుగా సాగించాలని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ సెంటర్ ఇన్ చార్జీలు, ట్యాబ్ అపరేటర్లకు సూచించారు. మంగళవారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సూపర్ వైజర్లు, సెంటర్ ఇన్ చార్జీలు, ట్యాబ్ అపరేటర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులు, హమలీలతో సామరస్యంగా ఉండాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తాగు నీరు, నీడ సౌకర్యం, ఇతర సదుపాయాలను కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లో సెంటర్ ఇంచార్జీలు ఎవరి ఒత్తిళ్లకు గురికాకుండా వరి ధాన్యం కాంటాలు చేపట్టాలని అన్నారు. సహకార సంఘం వ్యాపారపరంగా ముందుకు వెళ్తుంది కాబట్టి సంఘానికి ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవాలని అన్నారు.
సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతులు వరి ధాన్యం పోసినప్పటి నుంచి నిర్ణీత తేమ శాతం వచ్చి తగు నాణ్యత ప్రమాణాలు ఉన్నవరి ధాన్యాన్ని కాoటా జరిపి రైసు మిల్లులకు ధాన్యం సరఫరా అయ్యే వరకు సెంటర్ ఇంచార్జీలు విధిగా రికార్డులు నిర్వహించాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రం లో ధాన్యం పోసిన వెంటనే వారి నుంచి ఆదార్, పట్టా దార్ పాస్ పుస్తకం, మొబైల్ నెంబర్, బ్యాంకు పాస్ పుస్తకం జీరాక్స్ ప్రతులు విధిగా తీసుకొని ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం వహించరాదని, కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు షార్టేజీ రాకుండా చూసుకోవాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, ప్యాడి సూపర్ వైజర్లు, సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు, సంఘ సిబ్బంది, పాల్గొన్నారు.