calender_icon.png 18 November, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్ప్ ఎదుట ప్రతిజ్ఞ

18-11-2025 04:42:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): మున్సిపల్ ఆఫీసు నందు నషా ముక్త్ భారత్ అనే అంశంపై మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఉద్యోగులులో భాగంగా మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కాకుండా ఉంటామని అంతేకాకుండా ఇతరులను మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండే విధంగా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ ఎవరు మత్తు పదార్థాలకు బానిస కాకూడదని ఇతరులను మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండే విధంగా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ లక్ష్మీ రాజు, మేనేజర్ అనూఫ్, సానిటరీ ఇన్స్పెక్టర్లు దేవదాసు, ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.