03-12-2025 02:50:01 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామ పంచాయితీ కాంగ్రెస్ పార్టీ బలపరిచి మాఖం నరసింహారావును అభ్యర్థిగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మాఖం నరసింహారావు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి,మండల నాయకులకు,గ్రామ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.