calender_icon.png 3 December, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓడేడులో బిఆర్ఎస్ పార్టీకి షాక్

03-12-2025 03:50:12 PM

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీటీసీ శీలం తిరుపతి

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు

ముత్తారం,(విజయక్రాంతి): స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లో ముత్తారం మండలంలోని ఓడేడు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్  తగిలింది. ఓడేడు మాజీ ఎంపీటీసీ శీలం తిరుపతి బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తిరుపతికి కండువా కప్పి మంత్రి శ్రీధర్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరి రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.