బెంగాల్‌లో మమత వర్సెస్ గవర్నర్
ఎమ్మెల్యేల ప్రమాణంపై టగ్ ఆఫ్ వార్
కోల్‌కతా, జూన్ ౨౮: కొత్తగా ఎన్నికైన ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు మహిళ లు భయపడుతున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మండిపడ్డారు. ప్రజాప్రతినిథులు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని సూచించారు. బారానగర్ ఎమ్మెల్యే సయ ంతిక బంధోపాధ్యాయ, భగబంగోల ఎమ్మెల్యే రాయత్ హుస్సేన సర్కార్.. గవర్నర్ కోరినట్లు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేసేందుకు నిరాకరించారు.
ప్రజా ప్రతినిధులు శాసనసభలోనే ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేస్తూ గత ౩ రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీనిపై మమతా శుక్రవారం స్పందిస్తూ మహిళలు రాజ్ భవన్‌కు వచ్చేందుకు భయపడుతున్నారని, ఈ మేరకు తనకు సయంతిక నుంచి ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఏదాది మే నెలలో రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహి ళా ఉద్యోగి తనపై లైగింక దాడి జరిగిందని ఆరోపించింది. ఆ ప్రకటన అప్పట్లో పెను రాజకీయ దుమారం సృష్టించింది. ఆ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సయంతిక తాను రాజ్ భవన్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. ‘రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు నా కుటుంబ సభ్యలు అనుమతించడం లేదు. అక్కడ జరిగిన విషయం గురించి వారికి కూడా తెలుసని పేర్కొన్నారు.






