అది ఓటుబ్యాంకు నివేదిక
అమెరికా రిలీజియస్ ఫ్రీడం రిపోర్టుపై భారత్
న్యూఢిల్లీ, జూన్ 28: అమెరికా విదేశాంగశాఖ విడుదల చేసిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదికపై భారత్ తీవ్రంగా మండిపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ల్లో మైనారిటీల ఓట్ల కోసమే ఈ నివేది కను విడుదల చేసినట్టుగా ఉన్నదని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ విమర్శించారు. నివేదికలోని అంశాలన్నీ శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు. భారత సమాజ నిర్మాణాన్ని ఏమా త్రం అర్ధంచేసుకోకుండా నివేదికను రూపొందించారని విమర్శించారు. నివేదికను నిర్దందంగా తిరస్కరస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఉద్దేశపూర్వయంగా కొన్ని అంశాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి నివేదికలో ప్రస్తావించినట్టుగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. అమె రికా విడుదల చేసిన నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసింది. మతమార్పిడి నిషేధ చట్టాలను కఠినతరం చేయటం, విద్వేష ప్రసంగాలు, మైనారిటీల ఇండ్లు, ప్రార్ధనా మందిరాలను కూల్చివేయటం భారత్‌లో పెరిగిపోతున్నదని విమర్శించింది.






