22 March, 2026 | 7:53 PM

ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

08-10-2025 12:23 AM

ఉప్పల్ అక్టోబర్ 7 (విజయక్రాంతి) : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇపిస్తా అంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం ఇన్‌స్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ తెలిపారు ప్రకారం చిత్తూరు జిల్లా చెందిన ఎర్ర సాని హేమ శేఖర రెడ్డి ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం అశోక్ నగర్‌లో నివాసం ఉంటు న్న శేఖర్ రెడ్డి ఉద్యోగాలు పెట్టిస్తా అంటూ మల్లాపూర్ చెందిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్ పత్రాన్ని ఇవ్వడంతో అది నకిలీదని తెలియడంతో నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నాచారం పోలీసులు శేఖర్ అదుపు లోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.