18-07-2025 09:17:06 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం నాడు నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లాలో పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలు మదన గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. జటప్రోలు బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు గ్రామాలు, వార్డులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి నాగర్ కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.