18 April, 2026 | 7:28 PM

నకిలీ ఇంజిన్ ఆయిల్ అమ్మకం.. వ్యక్తి అరెస్ట్

31-05-2025 01:21 AM
  1. రూ. 2 లక్షల నకిలీ ఇంజిన్ ఆయిల్, రూ.14 లక్షల విలువ 
  2. గల టొయోటా కారు  సీజ్ కోదాడ రూరల్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు.
  3. వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట మే 30 (విజయక్రాంతి) : నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యలయంలో  ఎస్పీ నరసింహ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ చెందిన కాకాని నాగ వేంకటేశ్వర రావు  విజయవాడలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కాలేజీలో  డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడన్నారు.

1998 నుండి విజయవాడలోని లూబ్రికేంట్ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ఇంజన్ ఆయిల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేసినట్లు తెలిపారు.  అనుభవంతో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారుచేసి పేరుగాంచిన కంపెనీ స్టిక్కర్లు వేసి  అమ్మాలని ఆలోచన చేసినట్లు తెలిపారు. అయితే వాటిని షాప్ లో అమ్మితే గుర్తుపడతారని బైకు మెకానిక్ లకు తక్కువ దరకు సరఫరా చేయాలని ఆలోచనతో కలకత్తా నుండి క్యాస్ట్రోల్, ప్రో హోండా, హీరో, సర్వో, బజాజ్ డిటిఎస్ స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడన్నారు.

తదుపరి విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే  వారి వద్ద నుండి నకిలీ ఇంజన్ ఆయిల్ తక్కువ దరకు పెద్ద పెద్ద డ్రమ్ములు  కొనుగోలు చేసి తన  ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ లో  నకిలీ ఇంజన్ ఆయిల్ నింపి  టిన్ క్యాప్స్ సీల్ చేసి  కలకత్తా నుండి తెప్పించిన వివిధ కంపెనీల గల స్టిక్కర్లు అతికించి ఒరిజినల్ వాటిలాగే బైక్ మెకానిక్ లకు లీటర్ 200 రూపాయల చొప్పున అమ్మేవాడన్నారు..

ఆ విధంగా 2009 వరకు ఈ వ్యాపారం  చేశాడన్నారు. అయితే 2007 సంవత్సరంలో వన్ టౌన్ పోలీస్ వారు పట్టుబడి చేసి కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. తర్వాత ఆ వ్యాపారం బంద్ చేసి అగ్రిగోల్ సంస్థ లోమార్కెటింగ్  ఉద్యోగం 2017 వరకు చేశాడన్నారు. తదుపరి కంపెనీ మూసి వేయడంతో తిరిగి పాత వ్యాపారం మొదలు పెట్టాడన్నారు.

ఇలా 6  కంపనిలకు చెందిన నకిలీ ఇంజన్ ఆయిల్  మొత్తం 20 కాటన్ బాక్స్ లను ప్యాక్ చేసుకొను కొత్త టయోటా రోమియో కారు లో  వేసుకొని వెళ్తుండగా శుక్రవారం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి జిల్లా సిసిఎస్ పోలీసు, కోదాడ రూరల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారన్నారు.

ఆయనను అదుపులోకి తీసుకోవడంతో పాటు14 లక్షల విలువ గల టొయోటా కారు  మరియు 2 లక్షల విలువగల నకిలీ ఇంజన్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.పట్టుబడి చేసిన సిసిఎస్సిఐ శివ, కోదాడ రూరల్ ఎస్త్స్ర  అనిల్ రెడ్డి మరియు సిబ్బందినీ ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, కోదాడ రూరల్ సిఐ రజిత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.