10-05-2025 10:06:12 PM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి గుడుంబా అక్రమంగా రావాణా చేస్తున్న ఒకరిని ఆరేస్టు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని దుబ్బపేట గ్రామానికి చెందిన అజ్మీర సనత్ కుమార్ 30 లీటర్ల గుడుంబా అక్రమంగా అడవిశ్రీరాంపూర్ కు రవాణా చేస్తున్నాడని అందిన సమాచారం మేరకు ముత్తారం ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో అడివి శ్రీరాంపూర్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సనత్ కుమార్ ద్విచక్ర వాహనం పై 30 లీటర్ల గుడుంబా తీసుకువస్తుండడంతో గుడుంబా స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాన్ని సనత్ కుమార్ ను అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మండలంలో ప్రభుత్వం నిషేధించిన గుణం ఎవరైనా అమ్మిన అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్స్ అశోక్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.