calender_icon.png 11 May, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనికులకు మద్దతుగా భారీ తీరంగా ర్యాలీ

10-05-2025 10:10:03 PM

పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ  గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. శనివారం స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. నాయకులు, విద్యార్థులు, ప్రజలు జాతీయ జెండా లను చేతబట్టుకొని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.

దీంతో పట్టణ పురవీధుల్లో త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... భారత్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వారి దేశాలకు తిరిగి పంపాలన్నారు. దేశ సరిహద్దులోని గ్రామాల్లో ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేయడం హేయమైన చర్య అని, పాక్ దాడులకు భారత సైన్యం దీటైన జవాబు ఇచ్చిందన్నారు. ఉగ్ర మూకలను శాశ్వతంగా నిర్మూలించాలని ఆకాంక్షించారు.