calender_icon.png 6 December, 2024 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాలో వరుస దొంగతనాలు

12-08-2024 02:41:23 PM

మూసి ఉన్న ఇల్లు,దుకాణాలే టార్గెట్ చేసి దొంగతనాలు.

దొంగలకు సంబందించిన వీడియోలు విడుదల చేసిన పోలీసులు.

ములుగు: జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జాతీయ రహదారి వెంట రాత్రి సమయాల్లో మూసి ఉన్న దుకాణాలతో పాటు,తాళం వేసి ఊర్లకు వెళ్తున్న ప్రజల ఇల్లు దొంగలకు టార్గెట్ గా మారుతున్నాయి. అయితే, ఈ వరుస దొంగతనాలు చేస్తుంది ఒకే గ్రూప్ దొంగలా,లేక వేర్వేరు గ్యాంగులా అనేది ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా ములుగు పోలీసులు ముగ్గురు వ్యక్తులు పండ్ల దుకాణ యజమానురాలిని బురిడి కొట్టించి డబ్బుల సంచితో ఎత్తుకెళ్ళినా వీడియోతో పాటు, అర్ధరాత్రి తాళం వేసి ఉన్న దుకాణాల్లో దొంగతనం చేసేందుకు సంచరిస్తున్న వీడియోలు విడుదల చేశారు. కొన్ని రోజులుగా జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణాల్లో చోరీలు జరుగుతున్నాయని, అనుమానిత వ్యక్తులతో పాటు, సంబందిత దొంగలను గుర్తించి తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు.