6 March, 2026 | 11:18 PM

నాచారంలో వ్యక్తి దారుణ హత్య

04-11-2025 01:35 AM

ఉప్పల్, నవంబర్ ౩ (విజయక్రాంతి): నాచారం పారిశ్రా మిక వాడలో  ఓ వ్యక్తి  హత్య గురైన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిం ది. నాచారం సబ్ ఇన్స్‌స్పెక్టర్ మైబెల్లి తెలిపిన వివరాల ప్రకా రం.. నాచారం పారిశ్రామిక వాడలో  తెలంగాణ ఫుడ్ పరిశ్రమ సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో దాడి  చేసి పారిపోయారు. రక్తపు మడుపులో తీవ్ర గాయాలైన  వ్యక్తిని చూసిన స్థానికులు నాచారం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసు లు సంఘటన స్థలాన్ని చేరుకుని  హత్యకు గురైన వ్యక్తి మురళీకృష్ణ  గుర్తించారు. మురళి కృష్ణ వృత్తి రీత్యా  సెంట్రింగ్ వర్కర్ అని అత ని భార్య ఉప్పల్ కళ్యాణపుర్లోని ఒక ఇంట్లో కేర్ టేకర్‌గా  పనిచే స్తూ జీవన సాగిస్తుందని తెలిపా రు. హత్యకు గల కారణాలు తెలియల్సి ఉం దని  పోలీసులు తెలిపారు. మృతిదేహంని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.