15 April, 2026 | 11:25 PM

జహీరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు

04-11-2025 01:34 AM

జహీరాబాద్, నవంబరు 3 :జహీరాబాద్ పట్టణంలో సదరు ఉత్సవాలను ఘనంగా ని ర్వహించారు. ఈ ఉత్సవాల్లో యూత్ జోష్ గా ఆడుతూ పాడుతూ చేరింతలు కొట్టారు. ఆదివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో దున్నపోతులను చక్కగా అలంకరించి ఆటపాటలతో ప్రధాన వీధుల గుండా ఊరేగిం చారు. ఈ ఉత్సవాల్లో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన స మావేశంలో వివిధ కుల సంఘాల నాయకు లు పెద్దలు పాల్గొన్నారు.

వీరికి గొల్ల కురుమ యాదవ సంఘం సదరు ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమానికి ముదిరాజ్, రజక, లింగాయత్, రెడ్డి సంఘా ల నాయకులు పాల్గొని ఉత్సవాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సదరు ఉత్సవ కమిటీ నాయకులు పాండు యాదవ్, సా యి యాదవ్, పవన్ యాదవ్, రమేష్ యా దవ్, మల్లేష్ యాదవ్, కుమార్, శ్రీకాంత్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, శంకర్ ముదిరాజ్, సంగప్ప ముదిరాజ్, శ్యామ్ రావు పటేల్, మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.