calender_icon.png 20 January, 2026 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

09-11-2024 11:18:45 AM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కోతగూడెం జిల్లా నూతనపాటి సురేష్, శనివారం ఉదయం భద్రాచలం శివారు ఆంధ్రా సరిహద్దు పురుషోత్తపట్నం, సెంటెన్స్ స్కూల్ వెనకాల, జామాయిల్ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సురేష్ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా హోటల్ నడుపుతున్నాడు. సురేష్ కి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు ఎల్ కె జి చదువుతుండగా మరొకరు 2వ తరగతి చదువుతున్నాడు.