09-11-2024 11:51:57 AM
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆమ్ బజార్లో శనివారం ఓ జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. పూజ జ్యువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిన ప్రమాదంలో సిసి కెమెరాలు, ఒక టీవీ అగ్నికి ఆహుతయ్యాయి. రూ. లక్ష మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో చెలరేగిన మంటలను ఆర్పీ మరింత నష్టం జరగకుండా చేశారు.