అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
18-05-2026 12:00 AM
కూకట్‌పల్లి, మే 17 (విజయక్రాంతి): అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కశ్మీర్ బ్రాహ్మణ కులానికి చెందిన ప్రతాప్ కుమార్ టిక్కు (66) మెరీనా స్కై అపార్ట్‌మెంట్ టవర్ 2లోని 1502 ప్లాట్‌లో నివసిస్తున్నాడు.
గత కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్న ప్రతాప్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం తాను ఉంటున్న 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






