calender_icon.png 13 November, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

13-11-2025 01:56:54 PM

హైదరాబాద్: పెళ్లి కావడం లేదని, తగిన పిల్ల దొరకకపోవడంతో హైదరాబాద్‌లోని ఘట్కేసర్‌లో ఓ యువకుడు  ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఆత్మకూరు మండలం హనకొండకు చెందిన 32 ఏళ్ల బుర్రా నరేష్ గా గుర్తించారు. అతను హైదరాబాద్ లోని అమీర్ పేటలోని ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. నరేష్ తల్లిదండ్రులు బుర్రా సురేందర్, రమ 2021 నుండి తమ కొడుకుకు తగిన పిల్ల కోసం వెతుకుతున్నారు. బట్టల షాపులో పని చేస్తున్నందుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ గత కొన్ని రోజులుగా నరేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్(Ghatkesar Railway Station) సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు.దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అములుకున్నాయి.