calender_icon.png 19 February, 2026 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ కొత్త యాప్ ప్రారంభం

19-02-2026 02:50:11 AM

  1. పౌర సమస్యలకు మైక్యూర్ పరిష్కారం
  2. అన్ని పౌర సేవలు ఇక ఒకే వేదికపై.. మైక్యూర్ యాప్ ఆవిష్కరణ
  3. శానిటేషన్ నుంచి టౌన్ ప్లానింగ్ వరకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్, సిటీబ్యూరో ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): సాంకేతికతను అందిపుచ్చుకుని నగర పాలనను మరింత పకడ్బందీగా మార్చే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక అడుగు వేసింది. పౌర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మైక్యూర్  పేరుతో సరికొత్త ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫారాన్ని బుధవారం ప్రారంభించింది.  ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మైజీహెచ్‌ఎం సీ యాప్ స్థానంలో, మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ యాప్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవం తం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రియల్ టైమ్ ట్రాకింగ్‌తో పారదర్శకత..

ఈ యాప్ లోని ప్రధాన ప్రత్యేకత ఫిర్యాదుల రియల్ టైమ్ ట్రాకింగ్..పౌరులు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం ఏ అధికారి వద్ద ఉంది..ఏ దశలో ఉంది..అనే విషయాన్ని యాప్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఫీల్ స్థా యి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరినీ సమన్వయం చేసేలా బలమైన బ్యాక్ ఎండ్ వ్యవస్థను దీనికి అనుసంధానించారు.

కేంద్రీకృత డ్యాష్బోర్డ్ ద్వారా ఉన్నతా ధికారులు ప్రతి ఫిర్యాదును పర్యవేక్షిస్తారు, దీనివల్ల సిబ్బంది పనితీరును అంచనా వేయడం సులభతరమవడమే కాకుండా పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు వివరించారు. పారదర్శక మైన వేగవంతమైన సేవల కోసం ప్రజలు మైక్యూర్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.

నగర పాలనలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ, సమస్యలను సత్వరమే పరిష్క రించేందుకు ఈ డిజిటల్ వేదిక ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిర్యాదులపై తక్షణ స్థితిగతులు తెలుసుకునే సదుపాయం ఉండటంతో, సిబ్బందిలో కూడా బాధ్యత పెరుగు తుందని బల్దియా విశ్వసిస్తోంది.

శానిటేషన్ నుంచి టౌన్ ప్లానింగ్ దాకా..

నగర ప్రజలు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలను ఈ యాప్ ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. సానిటేషన్, వీధి దీపాలు, దెబ్బతిన్న రహదారులు, మురుగు నీటి కాల్వల సమస్యలు, టౌన్ ప్లానింగ్ వంటి కీలక విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులను పౌరులు తమ మొబైల్ నుంచే నమోదు చేసుకోవచ్చు. వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్ను తీర్చిదిద్దారు. ఒక్క ఫిర్యాదుతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుం డా, పౌర సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదికపైకి చేర్చిన వన్ స్టాప్ సొల్యూషన్ గా మైక్యూర్ నిలవనుంది.