13-11-2025 12:18:33 PM
హైదరాబాద్: జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల డిపోకు(Gadwal depot bus) చెందిన బస్సుకు గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో బస్సు కర్నూలుకు వెళ్తోంది. మద్దూరు స్టేజి వద్ద వెనకాల టైర్ లోని బేరింగ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. బస్సు అద్దం నుంచి గమనించి అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులకు కిందకు దించేశారు. అనంతరం డ్రైవర్, ప్రయాణికులు నీటితో బస్సుకు మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్య స్థానాలకు తరలించినట్లు డ్రైవర్ తెలిపారు.